Never Miss Any Update Join Our Free Social Media Groups for Daily Alerts
Visakhapatnam Bheemunipatnam Revenue Dept Recruitment 2024 Apply Online for 40 E-Divisional Manager (Technical Assistant) Posts
ఏపీ రెవెన్యూ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో 40 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
దరఖాస్తు దాఖలు చేసేందుకు నవంబర్ 4 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు, ఈ-డివిజనల్ మేనేజర్లు పోస్టులను డిస్ట్రిక్ట్ కమిటీ ప్రతిపాదన మేరకు కలెక్టర్ అపాయింట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటాయి.
అందులో భాగంగానే విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖ జిల్లాలోని కొత్తగా ఏర్పడిన భీమునిపట్నం రెవెన్యూ డివిజన్‌లో ఈ-డివిజనల్ మేనేజర్ (టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
నెలవారీ జీతం:
- ఈ పోస్టుకు నెలవారీ వేతనం రూ.22,500 ఉంటుంది.
వయో పరిమితి:
- 2022 జూలై 1 నాటికి 21 నుంచి 35 మధ్య వయస్సు ఉండాలి.
విద్యార్హత:
- దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గ్రాడ్యూషన్ (బీసీఏ, బీఎస్సీ, బీటెక్), మాస్టర్ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను ఏదైనా గెజిటెడ్ అధికారి ద్వారా ధ్రువీకరించాలి.
ఎంపిక ప్రక్రియ:
- రాత పరీక్ష నిర్వహిస్తారు.
- రాత పరీక్ష అర్హత సాధించిన తరువాత, డిస్ట్రిక్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.
- ఐటీ సెక్టర్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండే సర్టిఫికేట్ ఉంటే, ఇంటర్వ్యూ సమయంలో 5 శాతం వెయిటేజ్ ఇస్తారు.
- డిస్ట్రిక్ట్ కమిటీ రిజర్వేషన్లను అమలు చేస్తుంది.
- ఈ ఉద్యోగ పదవీకాలం జాయిన్ అయిన రోజు నుంచి ఏడాది పాటు ఉంటుంది.
- ప్రభుత్వ సూచన, అలాగే ఉద్యోగి పనితీరును బట్టీ పొడిగించవచ్చు.
- అలాగే తప్పుడు సమాచారం పొందుపరిస్తే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు.
- నియామకం తరువాత ఏవైనా లోపాటు ఉంటే, ఏ నోటీసు లేకుండానే ఉద్యోగిని తొలగిస్తారు.
- భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు టెర్మినేట్ చేసే అధికారం ఉంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి:
- అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ https://visakhapatnam.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలి.
- నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు కూడా అందులో ఉంటాయి.
- ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించిన తరువాత, దరఖాస్తుదారు దాని ప్రింటెండ్ కాఫీతో పాటు సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలి.
విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. టెక్నాలజీ రంగంలో కెరీర్‌ను నిర్మించాలనుకునే అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం.
ముఖ్యమైన వివరాలు:
పోస్టులు: ఈ-డివిజనల్ మేనేజర్ (టెక్నికల్ అసిస్టెంట్)
సంఖ్య: 40
జీతం: నెలకు రూ.22,500/-
స్థానం: భీమునిపట్నం డివిజన్
అర్హత: BCA/B.Sc/BE/B.Tech/మాస్టర్స్ డిగ్రీ
వయసు: 21 నుండి 35 సంవత్సరాలు (01.07.2022 నాటికి)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: 04.11.2024
ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష , ఇంటర్వ్యూ (ఐటి అనుభవం ఉన్నవారికి 5% అదనపు మార్కులు)
ఎలా దరఖాస్తు చేయాలి: విశాఖపట్నం అధికారిక వెబ్‌సైట్ (https://visakhapatnam.ap.gov.in) ను సందర్శించండి.